![]() |
![]() |
.webp)
యాంకర్ శ్యామల గురించి అందరికీ తెలుసు. యాంకర్ గా ఆమెకు ఎంతో పేరుంది. అలాంటి శ్యామలకు ఇప్పుడు కోపం వచ్చింది. రీసెంట్ గా ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ ఒక వీడియోని పోస్ట్ చేసింది. తనకు ఎదురైనా ఒక ఇన్సిడెంట్ గురించి ఆ వీడియోలో చెప్పింది. అలాగే ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసెస్ మీద ఆమె ఫైర్ అయ్యింది.
లగేజీ కోసం ఎయిర్ పోర్టులో పడిగాపులు కాస్తున్నా స్టాఫ్ ఎవరూ కూడా అప్ డేట్ ఇవ్వడం లేదని, లగేజ్ కోసం అడగడానికి కనీసం ఏ స్టాఫ్ కూడా అందుబాటులో ఉండరూ అంటూ సీరియస్ అయ్యింది. లగేజ్ కోసం అనౌన్స్మెంట్ కూడా చేయరని ఇలా జరగడం తనకు ఇది మూడో సారి అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఇది వరకు చాలా మంది సెలెబ్రిటీలు ఎయిర్ పోర్టులో ప్రైవేట్ సంస్థల సేవల మీద ఫిర్యాదుల చేశారు. లగేజ్ మిస్ అయిందంటూ, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వరంటూ కూడా కంప్లైంట్స్ చేసిన విషయం తెలిసిందే . ఇండిగో డొమెస్టిక్ ఫ్లైట్ దిగాక లగేజ్ విషయంలో సంస్థ సరిగ్గా పని చేయడం లేదని ఫైర్ అయ్యింది. తనతో పాటు చాలా మంది పాసెంజర్స్ వెయిట్ చేస్తున్నారని, దాదాపు 45 నిమిషాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందంటూ అసహనం వ్యక్తం చేసింది. అండ్ ఫైనల్లీ శ్యామల వీడియో దెబ్బకు ఇండిగో క్షణాల్లో ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేసింది. యాంకర్ శ్యామల ఇన్ స్టా స్టోరీకి రిప్లై ఇచ్చింది. కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని సమస్యను పరిష్కరించింది. ఇలా వెంటనే స్పందించినందు కూడా బదులుగా థాంక్స్ అంటూ శ్యామల కూడా రిప్లై ఇచ్చింది.
![]() |
![]() |